
అది కూడా హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్లో .. ఇంతకి ఆమె పేరు మయూరి కాంగో .. ఈ పేరు చెబితే ఎవరూ సరిగ్గా గుర్తు పట్టకపోవచ్చు కానీ . మహేష్ హీరోగా వచ్చిన వంశీ సినిమా పేరు చెబితే అందరూ గుర్తుపడతారు . ఈ సినిమాల్లో మహేష్ ఫ్రెండ్ గా ఓ మోడల్ పాత్రలో ఈమె నటించింది. మయూరి బాలీవుడ్లో తన సినీ కెరీర్ ను మొదలుపెట్టింది .. 1995లో నజీమ్ అనే హిందీ సినిమాలు తొలిసారిగా నటించింది .. ఆ తర్వాత పాపా కెహెతే హై, బేటాబీ, హోగీ ప్యార్ కీ జీత్, మేరే అప్నే, బాదల్, పాపా ది గ్రేట్, జంగ్, శికారీ , వంటి సినిమాలో నటించింది .. అయితే కెరియర్ మొదట్లో మయూరి నటించిన సినిమాలన్నీ బాగానే హిట్ అయ్యాయి . అయితే తర్వాత ఈమెకు వరుసగా ప్లాప్‌లు ఎదురయ్యాయి .. మహేష్ తో చేసిన సినిమా కూడా విజయం అందుకోలేదు .. అలా చివరకు సీరియల్స్ చేసిన ఈమెకు నిరాశ మిగిలింది .. ఇక దాంతో చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పింది మయూరి.
అయితే ఇదే సమయంలో 2003 లో ఎన్నారై ఆదిత్య థిల్లాన్‌ను పెళ్లి చేసుకుంది మయూరి .. ఆ తర్వాత న్యూయార్క్ వెళ్లి అక్కడే సీట్లయింది .. అక్కడే ప్రముఖ కాలేజ్ బరూచ్ కాలేజ్ జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేసింది .. ఆ తర్వాత తన ప్రతిభతో ప్రముఖ గ్లోబల్ మీడియా ఏజెన్సీ పెర్ఫామిక్స్ అనే కంపెనీలో ఎండి హోదాలో పనిసింది .. అయితే ప్రస్తుతం మయూరి కాంగో గూగుల్ ఇండియాలో వర్క్ చేస్తుంది .. హెడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రోల్లో కీలక బాధ్యతల్లో ఈమె ఉంది .. అలాగే గూగుల్ డిజిటల్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్ విభాగాలను ఈమె పర్యవేక్షిస్తుంది .. ఇలా మయూరి కార్పొరేటర్ రంగంలో తనదైన మార్కుతో దూసుకుపోతుంది.
