
ఒకప్పుడు థియేటర్లో 50 రోజులు , 100 రోజులు సెంటర్లో అంటే ఎంతో గొప్పగా చెప్పుకునే రోజులు ఉండేవి .. కానీ ఇప్పుడు కలెక్షన్లు మాత్రమే అందరూ లెక్కలు వేస్తున్నారు .. అయితే ఇప్పుడు వీటి తో పాటుగా చెప్పుకునే రేంజ్ సెంటర్లో సంక్రాంతికి వస్తున్నాం 50 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది .. ఇక ఈ సినిమా ఏకంగా 92 సెంటర్లలో ఈ రన్‌ను పూర్తి చేసుకోవడం మరో విశేషం .
దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి మరో పెద్ద విజయాన్ని తనకు అందించిన తెలుగు ప్రేక్షకులకు తన సినిమా కోసం నిలబడ్డ డిస్ట్రిబ్యూటర్ల కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .. తమ హీరో వెంకటేష్ , నిర్మాతలు దిల్ రాజు , శిరీష్ తో పాటు హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి వీరి తో పాటు సంగీత దర్శకుడు భీమ్స్ కూడా స్పెషల్ విషెస్ తెలియజేస్తూ భారీ పోస్టును సోషల్ మీడియాలో పెట్టాడు . ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తర్వాత సినిమా ను మెగాస్టార్ చిరంజీవి తో చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసింది .. ఈ సినిమా తో మరోసారి 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ ను దున్నేయడానికి రెడీ అవుతున్నాడు.