నయనతార .. జస్ట్ ఇది ఒక పేరు మాత్రమే కాదు . సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన పేరు కూడా . నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.  ప్రతి ఒక్కరికి తెలిసిన ఆవిడే . ప్రతి ఇంటిలోనూ ఒకరు నయనతార ఫ్యాన్ అయ్యే ఉంటారు . అంతలా క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంది . కేవలం బోల్డ్ రోల్సే కాదు లేడీ ఓరియంటెడ్ రోల్స్ కూడా చేసి జనాలను మెప్పించింది.  ఒకటా రెండా నయనతార ఖాతాలో హిట్స్ ఎన్నో ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు . అలాంటి క్రేజీ రికార్డ్స్ కూడా నయనతార తన సొంతం చేసుకుంది .


మరీ ముఖ్యంగా నయనతార సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది . పెద్ద పెద్ద సినిమాలలో ఎవరైనా హీరోయిన్గా ఎవరిని పెట్టుకోవాలి అని ఆలోచిస్తే మాత్రం మొదటగా అందరికి తట్టే పేరు ఈ నయనతార . అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాకి 12 కోట్లు ఛార్జ్ చేసి సంచలన రికార్డు నెలకొల్పింది. జవాన్ సినిమాకి గాను నయనతార 12 కోట్లు పుచ్చుకుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.  అయితే జవాన్ తర్వాత నయనతార అలాంటి రెమ్యూనరేషన్  అందుకున్నిందే లేదు . కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో నయనతార రికార్డులు తుక్కుతుక్కు చేసేసింది సాయి పల్లవి అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .



బ్యాక్ టు బ్యాక్ తనదైన స్టైల్ సినిమాలను ఓకే చేస్తూ హిట్స్ అందుకుంటున్న సాయి పల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కే రామాయణం సినిమాలో నటిస్తుంది . రన్బీర్ కపూర్ రాముడిగా సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు.  ఈ సినిమాకి గాను అక్షరాల 15 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుందట సాయి పల్లవి.  ఆశ్చర్యం ఏంటంటే ఈ రెమ్యూనరేషన్ ని మూవీ టీం నే డిసైడ్ చేసిందట.  కానీ జవాన్ సినిమాకి మాత్రం రెమ్యూనరేషన్ నయనతార డిమాండ్ చేసిందట . అలా చూసుకున్నా సరే సాయి పల్లవి క్రేజీ రికార్డ్స్ సొంతం చేసుకుందనే చెప్పాలి . 15 కోట్లు అంటే మామూలు విషయం కాదు . ఆమె నటించిన ప్రేమమ్ సినిమాకి ఆమె అందుకున్న రెమ్యూనరేషన్ కేవలం 25 లక్షలు మాత్రమే . అలాంటిది ఇంత తక్కువ టైంలో 15 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగిపోయింది అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: