
అయితే అటువంటి చిరంజీవి ఇప్పుడు లోకల్ స్థాయిలో కాదు నేషనల్ స్థాయిలో ట్రోలింగ్కి గురవుతున్నాడు . దానికి కారణం చిరంజీవి ఒకానొక ఈవెంట్లో చేసిన మెగా వారసుడు కామెంట్స్ . అప్పుడు ఎప్పుడో ఫిబ్రవరి మొదటి వారంలో చేసిన ఆ కామెంట్స్ మార్చి మొదటి వారం వచ్చినా కూడా ఆయన పాలిట పెద్ద శనిలా దాపరించాయి . ఒకదాని తర్వాత ఒకటి ట్రోలింగ్ స్టార్ట్ అవుతూనే వచ్చింది. అసలు మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశంతో అలా కామెంట్ చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన పై పెద్ద ఎత్తున నెగిటివ్ విమర్శలే వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా లేడీస్ ఆయన మాట్లాడిన మాటలు పై పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆడపిల్ల వారసురాలు కాదా వారసుడే కావాలా ..భయమేస్తుంది ఆడపిల్లను కంటాడేమో అని అనడం ఏంటి ..? అంత పెద్ద మెగాస్టార్ కి ఆమాత్రం తెలియదా..? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
అయితే ఇదంతా లోకల్ స్థాయిలో జరిగితే జనాలు పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. కానీ నేషనల్ మీడియాలో సైతం చిరంజీవి మెగా వారసుడుపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉండడం .. చాలా చాలా ఆయన పరువును తీసేసేలా చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రముఖ వ్యక్తి చిరంజీవి వారసుడి కామెంట్స్ పై ఎలా స్పందించిందో ఆయనపై ఎలా నెగిటివ్ గా మాట్లాడిందో అందరికీ తెలిసిందే. ఈ తరుణంలోనే మరోసారి మెగాస్టార్ చిరంజీవి పేరు నేషనల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత పెద్ద మెగాస్టార్ అంత చిన్న ఈవెంట్లో టంగ్ స్లిప్ అవ్వడం ఏంటి అంటున్నారు . మరికొందరు సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడి ఉండొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు మొత్తం సర్వ నాశనం అయిపోయేలా చేసేసుకున్నాడు చిరంజీవి అంటున్నారు జనాలు . దీని నుంచి చిరంజీవి బయటపడాలి అంటే ఈ ఇష్యూ పై ఏదో ఒక విధంగా స్పందించాల్సిందే . మేటర్ కూల్ చేయాల్సిందే ఆ పూర్తి బాధ్యత చిరంజీవి పైనే ఉంది . చేద్దాం ఏం చేస్తారో..?