
ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాలయ్య కు సంబంధించిన ఒక వార్త యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి హీరో బాలయ్య తాజాగా డాకు మహారాజ్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా 100 కోట్లు క్రాస్ చేసింది. ప్రెసెంట్ అఖండ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు బాలయ్య . అయితే ఒక పక్క సినిమా షూటింగ్లో బిజీగా ఉంటే మరొక పక్క క్రేజీ షో కి హోస్ట్ గా సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆల్రెడీ హోస్ట్ గా మారాడు బాలయ్య .
ఇప్పుడు మరొక షో కి హోస్టుగా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ అతి పెద్ద రియాలిటీ షో గా ఎంత పాపులారిటి దక్కించుకుంది అనే విషయం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . అయితే త్వరలోనే స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ సీజన్ కి బాలయ్య హోస్టుగా వ్యవహరించబోతున్నారట . నిజానికి ఈ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున అని అనుకున్నారట . కానీ నాగార్జుననే కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారట . ఆ తర్వాత రానా దగ్గుబాటి - విజయ్ దేవరకొండ ఇలాంటి స్టార్ హీరోలను అనుకున్నారు అంటూ టాక్ వినిపించింది . కానీ సీనియర్ హీరో అయితే ఆ మజానే వేరు అని మరి ముఖ్యంగా బాలయ్య లాంటి సూటిగా మాట్లాడే వ్యక్తి అయితే రేటింగ్స్ బ్లాస్ట్ అవ్వడం కన్ఫామ్ అంటూ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట . బాలయ్య కూడా సరదాగా ఉంటుంది అంటూ ఈ రియాలిటీ షో కి హోస్టుగా చేయడానికి ఓకే చేశారట . ప్రజెంట్ ఈ యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!