
ఆమె చూస్ చేసుకునే కథలు ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఉంటాయి అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు . అంతేకాదు సాయి పల్లవి నటించిన "అమరన్" సినిమా ఆ తర్వాత నటించిన "తండేఅల్" సినిమా బ్యాక్ టు బ్యాక్ హిట్ అవ్వడమే అందుకు కారణం. రెండు సినిమాల్లోనూ ఆమె ప్రాణం పెట్టి నటించింది. అందులో నో డౌట్. ఆ రెండు పాత్రలలో సాయి పల్లవి కాకుండా మరి ఏ హీరోయిన్ నటించిన సరే సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి ఉండేది . అందులో అసలు డౌటే లేదు. తెలుగు
లోనే కాదు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో సాయి పల్లవి పేరు మారుమ్రోగి పోతుంది .
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో సాయి పల్లవిలో మరో హీరోయిన్ తయారయ్యింది అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆమె మరి ఎవరు కాదు "రీతు వర్మ". ఈ మధ్యకాలంలో రీతు వర్మ పేరు ఎంతలా హైలైట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె నటించిన మజాకా సినిమా తాజాగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకుంది . రీతు వర్మ కూడా ఇండస్ట్రీలో చాలా ట్రెడిషనల్ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది . ఆమెకు బోల్ట్ రోల్స్ అవకాశాలు వస్తున్న సరే అలా కాదు అంటూ కేవలం ట్రెడిషనల్ పాత్రలనే చూస్ చేసుకుంటుంది . ఇప్పటివరకు రీతు వర్మ నటించిన అన్ని సినిమాలను గమనిస్తే ఆమె చాలా పద్ధతిగా ఉన్న రోల్స్ ని ఓకే చేస్తుంది . ఇండస్ట్రీలో మరో సాయిపల్లవి లా రీతు వర్మ తయారవుతుంది అంటూ మాట్లాడుతున్నారు జనాలు . సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఉంటే అసలు నటించదని ..సినిమా కథలో ఆమెకు ప్రాధాన్యత ఉంటే నటిస్తుంది అని ఫ్యూచర్లో సాయి పల్లవి లా ఈ హీరోయిన్ కూడా మారిపోతుందేమో అంటూ మాట్లాడుకుంటున్నారు . దీంతో సోషల్ మీడియాలో రీతు వర్మ - సాయి పల్లవి ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!