మంచు విష్ణు హీరోగా ‘కన్నప్ప’  అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతుంది. వంద కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణునే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్,  అక్షయ్ కుమార్, మోహన్లాల్ , శివరాజ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో, దేశం లో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ అందరినీ ఈ చిత్రంలోకి తీసుకొని నిర్మించాడు. ఇప్పటికే ఒక టీజర్ విడుదలై పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. కాసేపటి క్రితమే రెండవ టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో ప్రభాస్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబువంటి వారు కనిపించారు. టీజర్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ప్రేక్షకులు కోరుకున్న వావ్ ఫాక్టర్స్ ఏమి లేకపోవడం గమనార్హం. అక్షయ్ కుమార్,ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ నటించారు కాబట్టి, వాళ్లకి సంబంధించిన షాట్స్ అభిమానులకు కాస్త గూస్ బంప్స్ తెప్పించాయి. అవి తప్ప ఈ టీజర్ లో చెప్పుకోడానికి ఏమి లేవని చెప్పొచ్చు.

మొదటి టీజర్, రెండవ టీజర్, విడుదలైన శివయ్య సాంగ్, ఇవన్నీ గమనిస్తే ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ మంచు విష్ణు అనే అనిపిస్తుంది. ఆయన డైలాగ్ డెలివరీ లో కానీ, ఆహార్యం లో కానీ ఉండాల్సిన ఇంటెన్సిటీ అసలు లేదు. అప్పట్లో ‘కన్నప్ప’ క్యారక్టర్ లో కృష్ణంరాజు ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఇదిలావుండగా టీజర్ లో చివరి షాట్ లో ప్రభాస్ కనిపించడం హైలైట్ గా మారింది. కానీ ఎందుకో ప్రభాస్ లుక్స్ ఒకప్పుడు ఉన్న రేంజ్ లో ఇప్పుడు లేవు. ఈ సినిమాలో కూడా ఆయన లుక్స్ చాలా తేడాగా ఉన్నాయి. సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానుల నుండి ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. కానీ ఇది చివరి కాపీ కాదు కాబట్టి, సినిమాలో ఆయన లుక్స్ మరింత బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇదిలావుండగా ఇప్పటికే ఈ వీడియోకు అన్ని భాషల్లో కలిపి 30మిలియన్ ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ క్రమంలో ఏప్రిల్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమా మంచు విష్ణు కలలను నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: