దేవ‌ర‌తో సాలిడ్ హిట్ అందుకున్న అగ్ర క‌థానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. వార్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో హృతికి రోష‌న్ క‌థానాయకుడిగా న‌టిస్తుండ‌గా.. తార‌క్ కీల‌క పాత్ర‌లో మెరుస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.ఇటీవల భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుపుకున్న ‘వార్-2’లో ఇప్పుడు హీరోల మధ్య డ్యాన్స్ వార్ జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ డ్యాన్స్ నెంబర్ సాంగ్ షూట్‌కు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.ఇక డ్యాన్స్‌లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరికీ అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. దీంతో ఇప్పుడు ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు పోటీ పడితే ఎలా ఉండబోతుందో ‘వార్-2’లో చూడబోతున్నాం అని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది.లేటెస్ట్గా వార్ 2 మూవీ సెట్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై సాంగ్ షూట్ జరగనుంది. నేడు మార్చి 4న అంధేరీలోని యష్ రాజ్ స్టూడియోస్‌లో వార్2లో వచ్చే ఓ ఎపిక్ డ్యాన్స్-ఆఫ్ సీక్వెన్స్ చిత్రీకరణను ప్రారంభించనున్నారు మేకర్స్.

ఇందులో 500 మందికి పైగా డ్యాన్సర్లు ఈ అద్భుతమైన నృత్య యుద్ధంలో పాల్గొంటారు. ఆరు రోజుల పాటు భారీ స్థాయిలో ఈ ఎపిక్ డ్యాన్స్-ఆఫ్ సీక్వెన్స్ను షూట్ చేయటకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇది క్లైమాక్స్ ఫైట్ సెట్-పీస్‌లోకి వెళ్ళే ఒక అద్భుతమైన డ్యాన్స్ యుద్ధంని మేకర్స్ చెబుతున్నారు.అయితే, ప్రీతమ్ మ్యూజికల్‌లో రానున్న ఈ సాంగ్ని బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ అమృత మహల్ అద్భుతమైన సెట్‌ను నిర్మించారని, ప్రీతమ్ చాలా ఫాస్ట్ బీట్తో సాగే పాటను కంపోజ్ చేశారని బాలీవుడ్ నివేదికలు చెబుతున్నాయి.ఈ డ్యాన్స్-ఆఫ్ ఆలోచన నిర్మాత ఆదిత్య చోప్రా నుండి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఒకరిపై ఒకరు పోటీగా చేసే ఈ డ్యాన్స్ నంబర్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని సినీ వర్గాలు వెల్లడించాయి. తమ అభిమాన నటుడు కాలు కదిపితే భూకంపాలే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చూడాలి మరి ఎన్టీఆర్-చరణ్ చేసిన నాటు నాటు పాటని మించేలా ఉంటుందోమో.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: