టాలీవుడ్ లో కొన్నిసార్లు చిత్రాలు చేతులు మారుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల విషయంలో ఇది చూశాం. కథలు నచ్చక రిజెక్ట్ చేయడం వల్లనో ఇతర కారణాల వల్లనో కొన్నిసార్లు హీరోలు తమకి వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేసేవారు. దర్శకులు అదే కథలని మరో హీరో దగ్గరకి తీసుకెళ్లి వాళ్ళతో సినిమాలు చేసేవారు. అలా చాలా చిత్రాలు సూపర్ హిట్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలావుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో రవితేజ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మాస్ మహారాజాగా తనకంటూ క్రేజ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన ఇడియట్ సినిమాతో స్టార్ డమ్ వచ్చేసింది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ జోష్ మీదున్న రవితేజ మధ్యలో వరుస డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నే ఒకప్పుడు లవ్ స్టోరీ లతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు తేజ  వరుసగా చిత్రం,నువ్వు నేను , జయం లాంటి సినిమాతో మంచి విజయాలను సాధించి అప్పుడున్న యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుంచి తేజ డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు సక్సెస్ అయితే దక్కడం లేదు.

సినిమా చేసిన కూడా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడమే తప్ప సక్సెస్ బాట పట్టడం లేదు. కారణం ఏదైనా కూడా ఆయన ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలను చేయడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక 2017 వ సంవత్సరంలో రానా హీరోగా వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాతో మరోసారి ఆయన కంబ్యాక్ ఇచ్చాడని అందరూ అనుకున్నప్పటికి ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు వరుస ప్లాప్ అయ్యాయి.ఇక తేజ, రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది అనుకోని కారణాలవల్ల ఈ సినిమా తెరమీదకి రాలేదు. ఆ సినిమా ఏంటి అంటే ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చెప్పాలి.అయితే రానాతో చేసిన ఈ సినిమాని మొదట రవితేజతో చేయాలనుకున్నాడట. రవితేజ కూడా ఈ కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి అప్పుడు రవితేజ ఉన్న బిజీ వల్ల ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోయాడు. దాంతో తేజ రవితేజ కోసం వెయిట్ చేసే ఓపిక లేక ఈ సినిమాను రానాతో చేశాడు. సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అటు రానాకి, ఇటు తేజకి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చిందనే చెప్పాలి.మరి మరోసారి తేజ ఇలాంటి ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని చేస్తే బాగుంటుంది అంటూ చాలామంది జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: