పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో పౌజి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ చిత్రం లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తూ ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెట్ లో ఉన్నది. అయితే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఎంత వీలైతే అంత త్వరగా ఫోజి సినిమాని పూర్తి చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తాందట. ఇందులో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి నటిస్తూ ఉన్నది. ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ తోనే ఎంతోమంది కుర్రాలను ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రంలో ప్రభాస్ ను ఢీకొట్టే ప్రతి నాయకుడు పాత్రలో ఎవరు నటిస్తారని విషయం మాత్రం ఇప్పటివరకు ఎక్కడ బయటికి రాలేదు.. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇందులో స్టైలిష్ విలన్ గా కనిపించే అవకాశం ఇద్దరికీ ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు సన్నీ డియోల్ కాగా మరొకరు హీరో గోపీచంద్ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా గోపీచంద్, ప్రభాస్ కాంబినేషన్లో సినిమా రావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ డైరెక్టర్ హను రాఘవపూడి గోపిచంద్ ఒప్పిస్తే ఖచ్చితంగా ఈ సినిమా లో నటించే అవకాశం ఉన్నదట.

ముఖ్యంగా హీరో విలన్ మధ్య బలమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు క్లాసికల్ గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి హీరో గోపీచంద్ నటిస్తారా బాబీ డియోల్ నటిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో బాబీ డియోల్ కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ విలన్ గా మారిపోయారు. మరి చిత్ర బృందం అఫీషియల్ గా ఎవరు విలన్ గా ఇందులో నటిస్తున్నారని విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన అభిమానులు ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే కచ్చితంగా థియేటర్లో తగలబడి పోతాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: