అక్కినేని నాగచైతన్య సమంత విడిపోయాక మళ్ళీ కలుస్తారు అని ఓ లక్ష మందిలో 90 వేల మంది అయినా అనుకున్నారు. అంతేకాదు వీరి ఫ్యాన్స్ అందరూ కూడా విడాకులు రద్దు చేసుకొని మళ్ళీ కలవాలి అని సోషల్ మీడియా వేదికగానే పెద్ద పెద్ద పోస్టులు పెట్టారు.కానీ విధి ఆడిన వింత నాటకం వీరిద్దరిని మళ్ళీ ఒక్కటి చేయలేదు. ఒక్కటి చేయకపోవడం పక్కనుంచితే నాగచైతన్య మళ్లీ పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో సమంత నాగచైతన్యలు కలవడం అసంభవం.ఇక చైతు సమంత ఇద్దరూ పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలలో మాజీ ల గురించి ప్రశ్నలు ఎదురవుతాయి.అలా సమంత మాత్రం కాస్త ఎమోషనల్ అవ్వడంతో పాటు ఎందుకు కలిసానా అన్నట్లుగా మాట్లాడుతుంది.కానీ నాగచైతన్య మాత్రం సమంతపై పాజిటివ్ కామెంట్లు చేస్తారు. 

అయితే తాజాగా సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకి ఓ అరుదైన అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో  సమంత మాట్లాడుతూ.. నేను నా 15 ఏళ్ల జర్నీలో ఎన్నో నేర్చుకున్నాను.ఎంతో మంది ఫ్రెండ్స్ ని సంపాదించుకున్నాను. అయితే నా సినీ కెరియర్ లో నేను కొన్ని సినిమాలు చేసి ఎందుకు చేశానా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను.అలాంటి సినిమాలు నా కెరీర్ లో కొన్ని ఉన్నాయి. నాకు భాష రాకపోవడంతో నేను జీరో నుండి స్టార్ట్ అయ్యాను.ప్రస్తుతం మీ ముందు ఇలా ఉన్నానంటే అంతా మీ అభిమానమే. ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు నాకు అంతా కొత్తగా అనిపిస్తుంది. ఇక నా ఫస్ట్ సినిమా మాస్కోవిన్ కావేరి అయినప్పటికీ ఆ సినిమా లో నటించిన సందర్భాలు ఎక్కువగా గుర్తులేవు.

ఎందుకంటే ప్రతి షూట్ కి చాలా గ్యాప్ వచ్చేది.అందుకే నాకు పెద్దగా గుర్తులేదు.కానీ ఏ మాయ చేసావే సినిమా సమయం షూటింగ్ మాత్రం నాకు ఇప్పటికి గుర్తుంది. గేట్ దగ్గర కార్తీక్ ను కలిసే సీన్ ఏమాయ చేసావే సినిమాలో ఫస్ట్ షార్ట్. దీంతోనే సినిమా స్టార్ట్ అయింది అంటూ సమంత తన మాజీ భర్త నాగచైతన్యను తలుచుకుంది.అయితే ఏమాయ చేసావే సినిమాలో నాగచైతన్య కార్తీక్ అనే పాత్రలో నటించారు.అలా తన మాజీ భర్త పేరు స్వయంగా చెప్పకుండా కార్తీక్ అని చెప్పి చైతుని గుర్తుచేసుకుంది. ఇక సమంత మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో సమంత బయటికి ఏదో కోపం ఉన్నట్టు మాట్లాడుతుంది. కానీ ఆమె మనసులో ఇంకా చైతన్యనే ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: