ఏంటి శ్రీలీల నిజంగానే ఆ హీరోతో డేటింగ్ చేస్తుందా.. ఎందుకు ఆ హీరో ఇంట్లో కనిపించింది..నిజంగానే శ్రీ లీల ఓ హీరోతో ప్రేమలో పడిందా అని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజెన్లు సోషల్ మీడియాలో షాక్ అయిపోతూ షాకింగ్ ఎమోజీలను పెడుతున్నారు. అయితే శ్రీ లీల ప్రేమలో పడిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ,హిందీ మూడు భాషల్లో రాణిస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్ తో పరాశక్తి మూవీలో చేస్తుంది. అలాగే తెలుగులో నితిన్ తో రాబిన్ హుడ్ లో నటిస్తుంది. అలాగే రవితేజతో కూడా మరో సినిమా చేస్తుంది. ఇక హిందీలో కార్తీక్ ఆర్యన్ తో ఆషీకీ -3 సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

రీసెంట్ గా ఈ మూవీ కి సంబందించిన ప్రమోషనల్ కంటెంట్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రమోషనల్ కంటెంట్ వీడియో తోనే సినిమాకి భారీ హైప్ పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీలీల బాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గట్లే హాట్ రొమాన్స్ చేయబోతున్నట్టు అర్థమవుతుంది.అయితే తాజాగా శ్రీలీల కార్తిక్ ఆర్యన్ తో కలిసి కనిపించింది. అయితే వీరిద్దరి మధ్య గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న డేటింగ్ వార్తలు నిజమేనేనని కామెంట్లు పెడుతున్నారు. అయితే కార్తీక్ ఆర్యన్ సోదరి కృతిక తివారి రీసెంట్ గా ఒక పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో కార్తీక్ ఆర్యన్ తో పాటు శ్రీలీల కూడా కనిపించడంతో అనుమానాలు మొదలైపోయాయి.

అంతేకాదు వీళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు,వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు డౌటే లేదు.. శ్రలీల కార్తీక్ ఆర్యన్ లు డేటింగ్ చేస్తున్నారు ప్రేమలో పడిపోయారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.కానీ మరి కొంత మందేమో డేటింగ్ లేదు ఏమీ లేదు.ప్రస్తుతం శ్రీ లీల ఆ హీరో తో సినిమా చేస్తుంది కాబట్టి ఆ హీరో సోదరీ ఇచ్చే పార్టీలో కనిపించింది. అందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏముంది అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ డేటింగ్ వార్తలతో శ్రీలీల మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: