
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛావా ను రూపొందించారు. ఈ లో ఆయన భార్య యేసుభాయ్ పాత్రలో రష్మిక మందన్న అద్బుతంగా నటించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేంకర్, ప్రదీప్ రావత్, కిరణ్ కర్మాకర్, అలోక్ నాథ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఛావా కు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించారు.అయితే చావా సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. దీంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఇంట్రెస్టింగ్ గ ఎదురు చూస్తునారు. అయితే ఆదివారం మేకర్స్ 'ఛావా' సినిమా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.ఇందులో భాగంగా 'ఛావా' సినిమా ట్రైలర్, రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ మార్చ్ 3న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆలాగే మార్చ్ 7న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే 'ఛావా' సినిమా ట్రైలర్ లో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే ఇప్పటివరకు కేవలం హిందీలో మాత్రమే ఏకంగా రూ.420 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ హీరో విక్కీ కౌశల్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో 'ఛావా' సినిమా టాప్ లో నిలిచింది