
గతంలో వచ్చిన భీష్మ వంటి సూపర్ హిట్ సినిమా అనంతరం వెంకీ కుడుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాబిన్ హుడ్ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరం వేసవి సెలవుల కానుకగా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో కనిపించారు. డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాలో నటించారని తెలిసి ఆయన పాత్ర గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు.
డేవిడ్ వార్నర్ ను బిగ్ స్క్రీన్ పైన చూడడానికి తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది. అయితే రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ నటించినందుకు రోజుకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్ర చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
అయితే నితిన్ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తున్నాడని తెలిసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు. కాగా, ఈ సినిమా ఈనెల 28న రిలీజ్ కానుంది. దీనికోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని నితిన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.