పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం కల్కి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో ప్రభాస్. ఈ సినిమా అనంతరం ప్రభాస్ మరికొన్ని సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ మారుతితో కలిసి ది రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు.


ఇదిలా ఉండగా.... ప్రభాస్ మరో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో "ఫౌజి" సినిమాలో నటిస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబో ఫౌజి సినిమాపై రోజుకో వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ను డీ కొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ యాక్షన్ హీరో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ విలన్ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్ అని సమాచారం అందుతుంది.


ఈ పిరియాడిక్ వార్ సినిమాలో ప్రభాస్ ను ఢీ కొట్టే పాత్ర చాలా పవర్ఫుల్ గా యాక్షన్ బేస్డ్ గా ఉంటుందని సినీ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఫౌజీ సినిమాలో విలన్ పాత్రలో సన్నీ డియోల్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. సన్నీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారట. అతని డేట్స్ కుదిరినప్పుడు సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.


అయితే ఈ సినిమా షూటింగ్ అతి తక్కువ సమయంలోనే ముగించే ఆలోచనలో ఉన్నారట. సినిమాను కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారట. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఈ సినిమాపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: