సాధారణంగా చిత్ర పరిశ్రమ లో ఉండే సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది .. ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజెన్లు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు .. అయితే హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో రోజుకో రూమర్ బయటకు వస్తూనే ఉంటుంది .. అయితే ఇప్పుడు తాజాగా ఓ హీరోయిన్ సైతం తనపై వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది . భారత స్టార్ క్రికెటర్ హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ సంబంధించిన ప్రేమ వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి ..


బాలీవుడ్ కి చెందిన బ్యూటీ తో సిరాజ్‌ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె మరి ఎవరు కాదు హిందీ బిగ్ బాస్ సేమ్ మహిరా శర్మ .. ఈమెతో సిరాజ్ ప్రేమలో ఉన్నారని వీరిద్దరూ గత కొన్ని రోజులు గా డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం కూడా జరిగింది .  అయితే ఈ విషయాన్ని అతనికి ఎంతో దగ్గరగా ఉండే సన్నిహితులు చెప్పినట్టు ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ బయటపెట్టింది. మహిరా చేసిన పోస్ట్ కు ఇన్స్టాల్ సిరాజ్ లైక్ కొట్టడం తో పాటు ఆమెను ఫాలో కావటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది .  అయితే ఇప్పుడు తాజాగా ఈ రూమార్స్ పై స్పందించింది మహిరా శర్మ.


ఈ విషయంపై చెప్పడానికి ఎలాంటిది ఏమీ లేదు .. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదంటూ ఈమె క్లారిటీ ఇచ్చింది .. అలాగే అభిమానులు తనకు ఎవరితోనైనా రిలేషన్షిప్ పెట్టగలరని .. ఇంతకుముందు పనిచేసిన నటులతో కూడా ఇలాంటి రూమర్లు వచ్చినట్టు ఈమె చెప్పుకొచ్చింది . అందుకే తనపై వచ్చే రూమార్స్ గురించి తను అసలు పట్టించుకోని కూడా ఈమె చెప్పుకొచ్చింది .  అలాగే తన కూతురు సెలబ్రిటీ అయినందుకే ఎవరితో మాట్లాడిన ఇటువంటి రూమర్స్ వస్తున్నాయని మహిరా తల్లి కూడా పేర్కొంది .




మరింత సమాచారం తెలుసుకోండి: