టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో తమన్నా భాటియా కూడా ఒకరు. అయితే గత కొన్నేళ్లుగా ఇమే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందనే విధంగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి చట్టపట్టలేసుకొని మరి తిరుగుతూ ఉండడంతో త్వరలోనే వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారనే విధంగా రూమర్స్ వినిపించాయి. అటు తమన్నా, విజయ్ వర్మ మధ్య ఎన్నో కథనాలు కూడా వినిపించాయి. ముఖ్యంగా వీరి రిలేషన్ పైన ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ తామిద్దరం స్నేహితులమే అంటూ వెల్లడించారు.


అంతేకాకుండా విజయవర్మ కుటుంబంతో కలిసి అప్పుడప్పుడు తమన్నా కనిపిస్తూ ఉన్నది. వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించడం వంటివి కూడా చేయడంతో వీరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందన్నట్లుగా వార్తలు వినిపించాయి. గత ఏడాది చివరిలో వీరిద్దరి మధ్య ప్రేమని బయట పెట్టడం జరిగింది త్వరలోనే మీ ఇద్దరం వివాహం చేసుకోబోతున్నామంటూ ప్రకటించిన ఈ జంట అలాంటి సమయంలోనే తమన్న చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.


ఒక ఈవెంట్లో తమన్నా పెళ్లిపై మాట్లాడుతూ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ప్రశ్నించగా.. ఇప్పట్లో తన పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో లేనంటూ వెల్లడించింది. అయితే తాజాగా వినిపిస్తున్న కథనం మేరకు కొన్ని వారాల క్రితం తమన్నా, విజయ్ వర్మ విడిపోయారని వీరిద్దరు స్నేహితులుగా కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారట. కారణం ఏంటో తెలియదు కానీ..తమన్నా, విజయ్ వర్మతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేసిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. 2023లో లవ్ స్టోరీ 2 చిత్రంలో సందర్భంగా వీరిద్దరి మధ్య రిలేషన్ బయట ప్రపంచానికి తెలిసిందని .. ఆ తర్వాత వీరిద్దరి మధ్య పలు రకాల వార్తలు కూడా వినిపించాయి. అయితే వీరిద్దరూ బ్రేకప్ వార్తల పైన అటు తమన్నా కానీ విజయ వర్మ కాని ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ విషయం పైన అభిమానులు కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: