నాచురల్ బ్యూటీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రజెంట్ సాయి పల్లవి .. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అంతా గ్లామర్ షో తో వెళ్తుంటే ఒక సాయి పల్లవి మాత్రం అటు ఆన్ స్క్రీన్ లోను ఇటు ఆఫ్‌ స్క్రీన్ లోను నిండై బట్టల్లో కనిపిస్తూ అందరినీ మెప్పిస్తుంది .. అలాగే తనదైన నటన డ్యాన్సులతో ప్రేక్షకుల హృదయాల్లో చేరగని ముద్ర వేసుకుంది .. లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది .. గత సంవత్సరం అమరాన్ సినిమాతో భారీ హీట్ అందుకున్న సాయి పల్లవి .. రీసెంట్ గా తండేల్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇలా వరుస విజయాల నేపథ్యంలో సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఆకాశాన్ని తాకిందని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .


ప్రజెంట్ సాయి పల్లవి చేతులో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి . అందులో ఒకటి జునైద్ ఖాన్ మూవీ కాగా మరొకటి  నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం .. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా , సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది . ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ గత సంవత్సరం మొదలైంది .. అయితే రామాయణం మొదటి పార్ట్ కోసం సాయి పల్లవి ఏకంగా 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందని అంటున్నారు .. ఇప్పటివరకు ఈ సౌత్ హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యూన‌రేషన్ అందుకోలేదు .. లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం తన బాలీవుడ్ తోలి మూవీ జవాన్ సినిమా కోసం 12 కోట్లే అందుకుంది .. అయితే ఈ లెక్కన పారితోష్కం పరంగా అగ్రస్థానంలో ఉండే న‌య‌న్ ను సాయి పల్లవి దాటేసిందని కూడా చెప్పవచ్చు .


అయితే సాయి పల్లవి ఇక నుంచి చేయబోయే ప్రతి సినిమాకు అంతే మొత్తంలో తీసుకుంటుందా ? ఇలా చేస్తే మనోళ్లు ఈమెను తట్టుకుంటారా ? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి .. అయితే నిజానికి సాయి పల్లవి డబ్బులు కంటే సినిమా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది .. అలాగే సినిమా ప్లాస్ అయినప్పుడు తన రెమ్యూనరేషన్లు వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి  .. ఈ స్థాయిలో ఎవరు ఇవ్వగలుగుతారో వారి దగ్గరే తీసుకుంటాను ప్రతి సినిమాకు ఇంత ఇవ్వండి అంటే అది మూవీ బడ్జెట్ ని సగం పెంచేసింది .. అది తప్పు అంటుంది కూడా సాయి పల్లవి . ఈ  బ్యూటీ రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: