తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో మంచి రివ్యూర్ గా పేరు ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రమే .. టాలీవుడ్ లో వచ్చే చిన్న సినిమాల నుంచి ప్రపంచ స్థాయిలో వచ్చే భారీ సినిమాలు , వెబ్ సిరీస్ లకు మహేష్ బాబు తనకు ఇంట్రెస్ట్ కలిగించే కంటెంట్ చూసి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకుంటాడు .. మరి కొన్నిసార్లు తన సన్నిహితులు తెలిసిన వారి కోసం సినిమాలు చూసి వాటి రివ్యూ ఇస్తూ ఉంటారు .  మహేష్ బాబు అలా పోస్టు పెడితే అది ప్రమోషన్ కు ఎంతో హెల్ప్ అవుతూ ఉంటుందని మేకర్స్ కూడా భావిస్తారు.


అయితే మహేష్ రివ్యూల గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో చేపటం విశేషం కాదు .. కానీ ఒక తమిళ దర్శకుడు మహేష్ రివ్యూలు కు ఉన్న పవర్ ఏంటో చెప్పటం ఇక్కడ కిక్ .. ఆ దర్శకుడే అశ్విన్ మారిముత్తు .. ఓ మై కడుగులే సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చిన అశ్విన్‌ .. అదే సినిమాని తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమిక్స్ చేశారు .. లేటెస్ట్ గా ఇతను డ్రాగన్ మూవీని తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ భారీ హీట్ అయింది. అయితే తాజా గా హైదరాబాదులో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో అశ్విన్‌ మాట్లాడుతూ .. మహేష్ సార్ రివ్యూల గురించి ప్రస్తావించాడు  .. ఓ మై కడవులే సినిమా చూసి మహేష్ సార్ పాజిటివ్గా రివ్యూ పోస్ట్ చేశారని అది చూసి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు తన సినిమా చూశారని కూడా చెప్పుకొచ్చాడు అశ్విన్‌ ..


అలాగే ఇప్పుడు డ్రాగన్ మూవీ గురించి కూడా ఎవరైనా మహేష్ సార్ కు చెబితే బాగుంటుందని ఆయన సినిమా చూసి సర్టిఫై చేస్తే తాము ఎంతో ఆనందిస్తామనించడం విశేషం .. అలాగే ఈవెంట్లో హీరో ప్రదీప్ రంగనాథన్,  డ్రాగన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మూవీస్ అధినేత రవిశంకర్ కలిసి ఈ సినిమాలో ఓ సన్నివేశాన్ని క్రియేట్ చేయడం అందరిని ఆకట్టుకుంది .. అలాగే ఈ సినిమాలో ఫేక్ ఇంటర్వ్యూలో పాల్గొని హీరో పక్కన ఉన్న వ్యక్తి మాటలకు తగ్గట్టు లిప్ సింక్ ఇస్తూ ఉంటారు .. అయితే ఇప్పుడు దాన్ని రీక్రియేట్  చేస్తూ ప్రదీప్ లిప్‌ సింక్‌ ఇస్తుంటే రవిశంకర్ సక్సెస్ మీట్ స్పీచ్ ఇవ్వడం తో ఆడిటోరియం మారుమోగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: