తమిళంలో స్టార్ హీరోగా పేరు పొందిన కార్తీ గత కొంతకాలంగా వరుస విజయాలతో బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం సర్దార్ 2 సినిమా సీక్వెల్లో బిజీగా ఉన్నారు కార్తీ. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. తాజాగా సర్దార్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో గాయపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కార్తి కాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో మైసూర్ లోని కీలకమైన ఒక యాక్షన్ సన్నివేశాలను షూటింగ్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.


దీంతో వెంటనే కార్తిని దగ్గరలో ఉండే ఆసుపత్రికి చిత్ర బృందం తరలించగా డాక్టర్లు చికిత్స అందించారు. అయితే ఒక వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. పూర్తిగా కోల్పోవడం కోసం కార్తీక్ మరో వారం రోజులు సమయం పడుతుందని వైద్యులు హెచ్చరించారట. దీంతో సర్దార్ 2 సినిమా షూటింగ్ను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. పూర్తిగా హీరో కార్తీ గాయం నుంచి కోరుకున్న తర్వాతే తిరిగి మళ్ళీ షూటింగ్ ప్రారంభించాలంటూ మేకర్స్ కూడా నిర్ణయించారట..


డైరెక్టర్ పి ఎస్ మిత్ర, రజిశా విజయన్, మాళవిక మోహన్, ఆశికారంగనాథ్, ఎస్ జె సూర్య తదితరులు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారట. అయితే కార్తీ తనకు జరిగిన విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన అభిమానులు మొదట ఆందోళన పడ్డ ఆ తర్వాత ఎలాంటి భయం లేదని తెలిసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. సర్దార్ సినిమా యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయేలా ఉన్నాయి అందుకే సర్దార్ 2 చిత్రంలో అంతకుమించి ఉండేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఇదే కాకుండా ఖైదీ 2 సినిమాని కూడా తెరకెక్కించాలని అభిమానులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సీక్వెల్ ని ఎప్పుడు తెరకెక్కిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: