
ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. అంతేకాకుండా వివిధ సినిమాలలో షూటింగ్ లలో రష్మిక బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.... తాజాగా రష్మిక మందనపై ఓ ఎమ్మెల్యే మండిపడుతున్నారు. రష్మికకు గుణపాఠం చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మిక రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
వివిధ భాషల సినిమాలలో నటిస్తున్న రష్మిక... కన్నడను నిర్లక్ష్యం చేస్తుందని మండి ఎమ్మెల్యే రవికుమార్ సీరియస్ అవుతున్నారు. రష్మిక హైదరాబాదినని చెప్పుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ చెప్పినట్లుగా సినిమా ఇండస్ట్రీ వారికి నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి, జెడిఎస్ నేతలు ఖండిస్తున్నారు.
కర్ణాటక బిజెపి, LoP నేత ఆర్ అశోకా, జెడిఎస్ నేత నిఖిల్ కుమారస్వామి రష్మికకు మద్దతు ప్రకటించారు. మీరు చెప్పినట్లు ఆటలు ఆడటానికి నటులు ఏమీ కాంగ్రెస్ కార్యకర్తలు కాదంటూ బిజెపి, LoP నేతలు విమర్శిస్తున్నారు. కన్నడ ప్రభుత్వం నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మికతో సహా మరికొందరు నటిమణులు రాకపోవడం వల్లనే ఈ వివాదం చెలరేగింది. దీంతో DY cm డీకే సినీ పరిశ్రమను హెచ్చరించారు. ఈ వివాదం మరింత చెలరేగేలా అనిపిస్తోంది. మరి రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యాలపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.