జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నతనం నుంచి సినిమాల్లోకి పరిచయమైన ఎన్టీఆర్ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాlన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.


సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీగా కలెక్షన్లను రాబట్టింది. దేవర సినిమా గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఈ సినిమా రూ. 550 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు. దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర-2 సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.


కాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నామని డ్రాగన్ సినీ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమా చాలా బాగుంటుందని చెప్పారు. కాగా డ్రాగన్ సినిమాను 2026 జనవరి 9వ తేదీన విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే.


అంటే డ్రాగన్ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వడంతో డ్రాగన్ సినిమాను జనవరిలో కాకుండా 2026 మార్చి 26వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చిత్ర బృందం నుంచి ఈ వార్త వెలువడిన అనంతరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: