
ఇక హీరోగా 2000 సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీలో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాలలో తరుణ్ సినిమా ఆల్ టైం రికార్డులను అందుకుంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న తరుణ్ వరుసగా సినిమాలు చేసి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తన హవాను కొనసాగించాడు. అనంతరం నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు.
అయితే తరుణ్ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ స్టోరీల సినిమాలనే చేస్తూ వచ్చాడు. వేరే కంటెంట్ ఉన్న స్టోరీలను ఎంచుకోకపోవడం తరుణ్ చేసిన పెద్ద మిస్టేక్ అయింది. వరుసగా లవ్ స్టోరీలు ఉన్న సినిమాలు చేయడం వల్ల కొంతమంది వాటిని ఇష్టపడలేకపోయారు. అనంతరం తరుణ్ వరుసగా ఫ్లాప్స్ తో వెనుకబడ్డాడు. తరుణ్ చివరగా 2017లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాను చేశాడు. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు తెలుగులో ఎలాంటి సినిమాలలో నటించలేదు.
అయితే నువ్వే కావాలి సినిమా చేస్తున్న సమయంలో తరుణ్ ను ఓ హీరోయిన్ వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసిందంట. కొన్ని ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరు బ్రేకప్ చెప్పుకున్నారట. ఆ హీరోయిన్ తరుణ్ ను మోసం చేసిందని తెలుసుకున్న అనంతరం ఆ హీరోయిన్ కు దూరమయ్యాడట. ఆ బాధ నుంచి కోలుకోవడానికి తరుణ్ కు చాలా సమయం పట్టిందని జోరుగా వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.