సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే నయనతార అనే చెప్పవచ్చు. ఈ బ్యూటీ తెలుగు, కన్నడ, తమిళ్ భాషలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ముఖ్యంగా తమిళనాట నయనతారకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంలో స్టార్ హీరోలతో సమానంగా పోటీపడి నయనతార నటిస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన ఈ బ్యూటీ నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.


ప్రస్తుతం నయనతార వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సినిమాల పరంగా తన హవాను కొనసాగిస్తున్న సమయంలోనే నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా నయనతార వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే వివాహం తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. అయినప్పటికీ ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గకుండా అత్యధిక రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు.


ఒక్కో సినిమాలో నటించడానికి కోట్లలో డబ్బులను తీసుకుంటున్నారట. కేవలం సినిమాలలోనే కాకుండా ప్రకటనల ద్వారా కూడా భారీగా డబ్బులను సంపాదిస్తున్నారు. అయితే రీసెంట్ గా నయనతారను ఓ కమర్షియల్ యాడ్ కోసం అప్రోచ్ అవ్వగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. అది కూడా కేవలం 50 సెకన్ల ప్రకటనకు కావడం విశేషం. అంటే నయనతార ఒక్క ప్రకటనలో నటించడానికి కోట్లలో డబ్బులు తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.


ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు పది కోట్లకు పైనే పారితోషకం తీసుకుంటున్నారు. అత్యధిక రెమ్యూనరేషన్ వసూలు చేసే హీరోయిన్ల జాబితాలో నయనతార ముందు వరుసలో ఉన్నారు. ఆయనప్పటికి దర్శక నిర్మాతలు ఏమాత్రం ఆలోచించకుండా నయనతారతో వరసగా సినిమాలు చేస్తున్నారు. ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నయనతార ఒక యాడ్ కోసం ఐదు కోట్ల రూపాయలు తీసుకోవడంతో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: