టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు... తొందరగా పాపులర్ అవుతుంటే మరి కొంత మంది కాస్త ఆలస్యంగా సక్సెస్ అవుతున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు అప్పట్లో... మంచి మంచి సినిమాలు తీసి ఇప్పుడు కనుమరుగయ్యారు. కొంతమంది హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో  లైలా ఒకరు. అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది హీరోయిన్ లైలా. ఇప్పుడు ఆమె వయసు 44 సంవత్సరాలు దాటిపోయింది.


అయినప్పటికీ చెక్కుచెదరని అందంతో... అందరినీ ఆకట్టుకుంటుంది లైలా. ఆమె పేరులోనే ఎంతో అందం ఉంది. అయితే అలాంటి హీరోయిన్ లైలాకు కొత్త సమస్య వచ్చి పడింది. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత లాగే హీరోయిన్ లైలా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారట.  ఓ భయంకరమైన వ్యాధి ఆమెకు సోకినట్లు తాజాగా పేర్కొంది. అవింత సమస్య కేవలం ఆమెకు మాత్రమే వచ్చిందట. తాను నవ్వకుండా ఉండలేనని.... నవ్వు ఆపేస్తే కన్నీళ్లు వస్తాయని ఆమె పేర్కొంది.


ఇది ఒక జబ్బు అని డాక్టర్లు తేల్చారట. శివ పుత్రుడు సినిమా సమయంలో.. నవ్వకుండా  ఒక నిమిషం పాటు ఉండాలని... హీరో విక్రమ్ ఛాలెంజ్ చేశాడట. కానీ ఆమె... 30 సెకండ్లు కూడా  ఉండలేక దారుణంగా ఏడ్చిందట. ఈ తరుణంలోనే ఆమె మేకప్ మొత్తం చెడిపోయిందని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.  దీంతో ఆమె వ్యాధి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవంగా హీరోయిన్ లైలా... స్వస్థలం  గోవా అని చెబుతారు. ఈమె ఫ్యామిలీ పూర్తిగా క్రిస్టియన్ కుటుంబం. ఈ అందాల తార తెలుగు, హిందీ తమిళ్ మలయాళం అలాగే కన్నడ భాషల్లో సినిమాలు తీసింది. తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయింది ఈ బ్యూటీ. ఎగిరే పావురమా, ఉగాది, పెళ్లి చేసుకుందాం, ఖైదీగారు, పవిత్ర ప్రేమ, శుభలేఖలు అలాగే లవ్ స్టోరీ లాంటి ఎన్నో సినిమాలు చేసింది లైలా. తన రీఎంట్రీలో సర్దార్ లాంటి సినిమాలు కూడా తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: