నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొంత కాలం క్రితం దసరా అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తోనే శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా కెరీర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే శ్రీకాంత్ తన రెండవ మూవీ ని కూడా నాని తోనే చేస్తున్నాడు. నాని , శ్రీకాంత్ కాంబినేషన్లో ప్రస్తుతం ది పారడైజ్ అనే మూవీ రూపొందుతుంది. ఇక నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.

ఇక ఈ సినిమా టీజర్ తో పాటు ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ది పారడైజ్ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీకి ఇంకా సంవత్సరం కంటే ఎక్కువ సమయం ఉంది. ఇంత త్వరగా ఈ మూవీ విడుదల తేదీని ఎందుకు ప్రకటించారా అనే అనుమానాలు కూడా కొంత మంది లో వ్యక్తం అయ్యాయి. కానీ మార్చి 26 వ తేదీ తర్వాత చాలా హాలిడేస్ ఉన్నాయి. దానితో అనేక స్టార్ హీరోల సినిమాలు ఆ తేదీకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ... దానితో ముందుగానే ది పారడైజ్ మూవీ బృందం వారు ఈ విడుదల తేదీని లాక్ చేసి ఉంటారు అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తపరుస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: