సౌత్ ఇండియాలో ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు. ఇక మీడియం రేంజ్ హీరోలు నటించిన కొన్ని సినిమాలకు విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే విడుదల అయిన మొదటి రోజు మీడియం రేంజ్ హీరోలలో హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన టాప్ 7 సౌత్ మూవీస్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ సినిమా సౌత్ ఇండియాలో మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలలో విడుదల అయిన మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా రూపొందిన అమరన్ సినిమా 36 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీ 27 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ మూవీ 25 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానంలో కొనసాగుతుంది. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన రాయన్ మూవీ 24.2 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో కొనసాగుతుంది. నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమా 22 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ మూవీ 20.5 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: