టాలీవుడ్ సింగర్ కల్పన గురించి తెలియని వారు ఉండరు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాలం నుంచి ఇప్పటివరకు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నారు. వివాదాలకు ఎప్పుడు వెళ్ళని సింగర్ కల్పన... ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సంఘటన టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకున్నట్లు కాసేపటికి క్రితమే... మీడియాలో కథనాలు రావడం జరిగింది. రెండు రోజుల కిందటే... ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు చెబుతున్నారు.

 హైదరాబాద్ లోని ఓ ప్రముఖ అపార్ట్మెంట్లో ఆమె నివాసం ఉంటున్నారట. అయితే నిద్ర మాత్రలు వేసుకొని రెండు రోజులపాటు డోర్ తీయకుండానే పడుకున్నారట. ఆమె రెండు రోజుల నుంచి డోర్ తీయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అపార్ట్మెంట్ వాసులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... సింగర్ కల్పన అపార్ట్మెంట్ డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. పోలీసులు ఆమె బెడ్ రూమ్  వరకు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసింది.

 బెడ్ రూమ్ లోనే ఆమె నిద్ర మాత్రలు తీసుకొని.. మత్తు లోకి వెళ్లిన సంఘటనను చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. మేడం మేడం అంటూ ఆమెను లేపితే... ఆమె అసలు కదలలేదు. సింగర్ కల్పన ఎన్ని నిద్ర మాత్రలు తీసుకున్నారో తెలియదు కానీ అసలు... కదలని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో వెంటనే ఆమెను అపార్ట్మెంట్ నుంచి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. స్ట్రక్చర్ పైన ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది.

 ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. వాస్తవానికి కల్పన అలాగే ఆమె భర్తకు... ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ... సింగర్ కల్పన ఎందుకు నిద్ర మాత్రలు... ఎందుకు తీసుకుంది అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఇక ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: