సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తాజాగా ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన సంగతి మనకు తెలిసిదే.ఇక ఈమె స్లీపింగ్ పిల్స్ వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పక్కింటి వాళ్ళు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అయితే ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణం ఏంటి.. అసలు ఆమె ఇలాంటి పని ఎందుకు చేసింది అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక విషయంలోకి వెళ్తే..కల్పనా తన భర్త ప్రసాద్ తో కలిసి నిజాంపేటలోని తన ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే గత రెండు రోజులుగా తన భర్త కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.అంతేకాకుండా రెండు రోజుల నుండి కల్పన ఇంటి డోర్ కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా..పోలీసులు వచ్చి డోర్ కొట్టగా ఎవరు డోర్ తెరవకపోవడంతో వెంటనే పోలీసులు డోర్ పగల కొట్టి బెడ్ పై అపస్పారక స్థితిలో పడి ఉన్న కల్పనను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. 

అయితే ఆమె బెడ్ పై పడుకున్న పక్కనే కొన్ని టాబ్లెట్స్ ఉండడంతో స్లీపింగ్ పిల్స్ అని వాళ్ళు గమనించారు.అయితే ఈ విషయంలో స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం భర్త కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఇంట్లో నుండి వెళ్లిపోయారని చెప్పడంతో కల్పనా భర్త పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వెంటనే కల్పన భర్త ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన కూడా కాస్త అనుమానస్పదకంగా కనిపించడంతోపాటు మీడియాకి మొహం చూపించడానికి ఇష్టపడలేదు. దాంతో భర్త వల్లే సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఏంటి అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సింగర్ కల్పన భర్తని పోలీసులు విచారిస్తున్నారు.ఈ విచారణలో ఆయన చెప్పిన విషయాలను బట్టి కల్పన రిఫ్రిష్మెంట్ కోసం కొన్ని పిల్స్ వాడుతుందని కానీ అవి ఓవర్డోస్ అవ్వడంతో అలా జరిగిందని కొంతమంది పోలీసులు అనుమాన పడుతున్నారు.

 కానీ రెండు రోజుల క్రితమే ఇంట్లో నుండి భర్త ఎందుకు వెళ్లిపోయారు. అలాగే రెండు రోజులుగా కనీసం ఫోన్ చేయకుండా బయటికి రాకుండా ఉన్న కల్పనను భర్త, ఫ్యామిలీ ఎందుకు పట్టించుకోలేదు. ఇందులో అనుమాన పడాల్సిన విషయం ఎంతో ఉంది అని పోలీసులు అంటున్నారు. ఇక ప్రస్తుతం కల్పన స్పృహలోకైతే రాలేదు. ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది  ప్రస్తుతం డాక్టర్లు ఎలాంటి హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేయలేదు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేయడంతో అందరి అనుమానాలు భర్త పైనే ఉన్నాయి. మరి చూడాలి ఇంకా ఈ విషయంలో పోలీసులు ఎలాంటి సమాచారాన్ని రాబడతారో.అయితే కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసింది అనే విషయం తెలియగానే చాలామంది ఆమె తోటి సింగర్స్ కల్పనను చూడడానికి హాస్పిటల్ కి పరుగులు తీస్తున్నారు.అలా ఇప్పటికే సింగర్ సునీత, శ్రీకృష్ణ, గీతామాధురి వంటి వాళ్లు హాస్పిటల్ కి వెళ్లారు

మరింత సమాచారం తెలుసుకోండి: