ఏంటి తమన్నా భాటియా నిజంగానే ప్రియుడిని మోసం చేసిందా.. లవర్ ని మోసం చేసి మరో హీరోతో సహజీవనం చేస్తుందా.. బీటౌన్ లో వినిపిస్తున్న వార్తల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. గత రెండు మూడు సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న ప్రేమ జంటల్లో తమన్నా భాటియా విజయ్ వర్మలు ఒకరు.. విజయ వర్మ తెలుగువాడే అయినప్పటికీ బాలీవుడ్లో రాణించారు. తమన్నా  మాత్రం అటు సౌత్ ఇటు నార్త్ రెండు ఇండస్ట్రీలలో పాగా వేసింది.అలా గత కొద్ది రోజులుగా ఎక్కువగా బాలీవుడ్ లోనే కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం ఇండస్ట్రీ మొత్తం టామ్ టామ్ అయింది. అయితే మొదట న్యూ ఇయర్ పార్టీ జరిగిన సమయంలో గోవాలో ప్రియుడితో రెచ్చిపోయి కనిపించింది.

దాంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించాయి. ఇక డేటింగ్ వార్తలు వినిపించిన కొద్ది రోజులకే తమ మధ్య ప్రేమ ఉందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దాంతో వీరి పెళ్లి అప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అంటూ ఎన్నో రూమర్లు వినిపించాయి. పెళ్లి వార్తలు దాట వేసుకుంటూ వస్తున్న ఈ జంట సడన్గా విడిపోయిందంటూ ప్రముఖ వెబ్సైట్ పింక్ విల్లా పేర్కొంది. తమన్నా విజయ్ వర్మ ఇప్పుడు కాదు గద కొద్ది రోజుల ముందే బ్రేకప్ చెప్పుకున్నారు.ప్రస్తుతం వారు స్నేహితులుగా కొనసాగుతున్నారు. వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. వారు తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకొని ఫ్రెండ్స్ గా ఉంటున్నారు అంటూ సంచలన వార్త రాసింది.

దీంతో ఈ వార్త క్షణాల్లో ఇండియా మొత్తం వైరల్ అయ్యింది.ఇక ఈ వార్తలతో విజయ్ వర్మ తమన్నా భాటియాల బ్రేకప్ వార్తలు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు తమన్నా గాని విజయ్ వర్మగాని క్లారిటీ ఇవ్వకపోవడంతో నిజంగానే వీళ్ళు విడిపోయారని అందరూ అనుకుంటున్నారు. అయితే తమన్నా బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పడానికి కారణం మరో హీరోతో ఎఫైర్ అని,తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న ఓ నటుడితో లవ్ లో ఉందని,అందుకే విజయ్ వర్మకి బ్రేకప్ చెప్పింది అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి.కానీ విజయ్ వర్మ తమన్నా బ్రేకప్ లపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: