శ్రీకాంత్ ఓదెల నాచురల్ స్టార్ నాని కాంబోలో ఇప్పటికే దసరా మూవీ వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే మళ్లీ వీరి కాంబోలో ఓ సినిమా రిపీట్ అవబోతుంది అనే వార్తలు రావడంతోనే నాని అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు.ఎందుకంటే దసరా సినిమా నాని కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వీరి కాంబోలో సినిమా అంటే ఈ సినిమా ఏ లెవెల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపించారు.అయితే ఎట్టకేలకు నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోయే ది ప్యారడైజ్ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది.ఇక ఈ టీజర్ లో నానిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక డిఫరెంట్ లుక్ లో,డిఫరెంట్ మేకోవర్ తో చూపించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.రెండు జడలు వేసుకొని కనిపించిన నానిని చూసి సినిమా పెద్ద ఎత్తున ఉండబోతుంది అని అందరూ అనుకున్నారు.

అంతే కాదు సలార్, కే జి ఎఫ్,బలగం వంటి సినిమాలన్నీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక భారీ సినిమాని శ్రీకాంత్ ఓదెల నానితో ది ప్యారడైజ్ రూపంలో చేయబోతున్నారనే టాక్ వినిపించింది.అయితే ఈ సినిమా టీజర్ లో కొన్ని బూతులు కూడా ఉండడంతో నాని పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని రోజులు మంచి మంచి ప్రాజెక్టులు చేసిన నాని ఎందుకు ఇలాంటి ఒక సినిమాని ఎంచుకున్నారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు.కానీ ఎప్పుడూ ఒకే జానర్లో వెళ్తే ఏముంటుంది కిక్కు ఇలాంటి జానర్ లో సినిమాలు ఎంచుకుంటేనే కదా నటుడుగా తన లైఫ్ కి పరిపూర్ణత ఏర్పడుతుంది అనుకున్నారో ఏమో కానీ నాని ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

అయితే నాని నటించబోతున్న ది ప్యారడైజ్ మూవీ మొదట శ్రీకాంత్ ఓదెల వేరే హీరోతో చేయాలి అనుకున్నారట.కానీ ఆ హీరో రిజెక్ట్ చేయడంతో మళ్ళీ నానిని పెట్టి ఈ సినిమా చేస్తున్నారు అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం నానితో చేయబోతున్న ది ప్యారడైజ్ మూవీ మొదట శ్రీకాంత్ ఓదెల తమిళ స్టార్ హీరో సూర్యతో చేయాలి అనుకున్నారట. కానీ అప్పటికే సూర్య కంగువా సినిమాకి ఫిక్స్ అవడంతో మళ్ళీ అలాంటి జానర్లో సినిమా ఎందుకు అని రిజెక్ట్ చేసారట. ఇక సూర్య రిజెక్ట్ చేయడంతో శ్రీకాంత్ ఓదెల వెంటనే నానికి ఈ కథ చెప్పి ఫిక్స్ చేశారట. అలా ఎన్నో విమర్శలు వెలువెత్తుతున్న ది ప్యారడైజ్ మూవీ మొదట సూర్య రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.మరి ది ప్యారడైజ్ మూవీతో నానికి మంచి పేరు వస్తుందా లేకపోతే ఉన్న పేరు పోతుందా అనేది సినిమా విడుదలైతే గాని చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: