కన్నడ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా పేరుపొందింది నటి రన్యా రావు.. రన్యా ఒక ఐపీఎస్ అధికారి అయినటువంటి రామచంద్రారావు కూతురే అయినప్పటికీ కూడా ఇమే ఎక్కువగా.. వ్యాపారాల కోసమే దుబాయ్ కి వెళ్తూ వస్తూ ఉంటుందట.అయితే ఈమె బంగారు కడ్డీలతో బెంగళూరుకి రావడంతో వెంటనే ఢిల్లీ DRI బృందానికి సైతం రన్యా స్మగ్లింగ్ చేస్తోంది అంటూ ముందుగానే సమాచారం రావడంతో అధికారుల సైతం మార్చి మూడవ తేదీన రన్యా వస్తున్న విషయాన్ని గుర్తించిన అధికారులు రెండు గంటల సమయంలో విమానాశ్రయానికి చేరుకున్నారట.


దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానం  సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో బెంగళూరుకి రావడంతో అధికారులు ఈ నటిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున న్యాయమూర్తి ముందు రన్య రావుని హాజరు పరచగా మార్చి 18 వరకు జ్యూడిషియల్ కస్టడీకి తరలించాలంటూ జడ్జి ఆదేశాలను జారీ చేశారట. ప్రత్యేక ఆర్థిక నేరగాళ్ల కోర్టు న్యాయమూర్తి ఈ విషయాలను పరిగణంలోకి తీసుకున్నారట. రన్యా మాణిక్య, పటాకి వంటి కన్నడ సినిమాలలో నటించిందట.


అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇలా జైలు పాలు అవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది ఇలా బంగారం అక్రమ రవాణా చేయడం అవసరమా అంటూ ఇలాంటి పాడు పనులు అంటూ ఈమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక నటిని జిడిషియల్ కస్టడీకి పంపించే ముందే వైద్య పరీక్షలు నిర్వహించారట అధికారులు.. బౌరింగ్ ఆసుపత్రిలో నటికి అన్ని రకాలైన వైద్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి వారైనా సరే అక్రమ రవాణా చేస్తే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విషయాన్ని ఇలా మరొకసారి అధికారులు నిరూపించారని పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మొత్తానికి ఈ అక్రమ రవాణా బిజినెస్ పైన నటి రన్యా ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: