చాలా రోజుల నుండి జీవీ ప్రకాష్హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని,ఆ హీరోయిన్ తో ఉన్న ఎఫైర్ కారణంగానే తన భార్యకి విడాకులు ఇచ్చారని ఇన్నేళ్ల సంసార జీవితాన్ని పక్కనపెట్టి మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారంటూ ఇలా ఎన్నో వార్తలు జీవి ప్రకాష్ పై వినిపిస్తూనే ఉన్నాయి. అయితే జీవి ప్రకాష్ నటి దివ్యభారతి ప్రేమలో ఉన్నారని, అందుకే వారిద్దరూ కలిసి వరుసగా రెండు సినిమాలు చేసారనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే జీవి ప్రకాష్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా దాదాపు 24 సినిమాలు చేశారు. కింగ్ స్టోన్ అనేది ఆయన 25వ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్గా దివ్యభారతి నటించింది.ఇక దివ్యభారతి మొదటి సినిమా హీరోగా కూడా జీవి ప్రకాష్ నటించారు.అయితే దివ్యభారతితో సినిమా చేసిన సమయంలోనే జీవీ ప్రకాష్ భార్య సైంధవికి విడాకులు ఇవ్వడంతో ఆ హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది అని, ఆ హీరోయిన్ జీవి ప్రకాష్ ని వలలో వేసుకుంది అంటూ ఎన్నో రూమర్లు వినిపించాయి అయితే ఈ రూమర్లను ఇద్దరు ఖండించారు. 

ఇక రీసెంట్ గా కింగ్ స్టోన్ ప్రమోషన్స్ లో భాగంగా దివ్యభారతికి ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.కాని దివ్యభారతి ఈ వార్తలను ఖండించింది. వరుసగా రెండు సినిమాల్లో చేస్తే ప్రేమ ఉన్నట్టేనా.అయినా సినిమాలో నటించే ఆర్టిస్టులు అందరి మధ్య ప్రేమ ఉంటుందా.. ఎందుకు ఇలాంటి చెత్త వార్తలు క్రియేట్ చేస్తారు.ఆయన విడాకులకు కారణం నేను కాదు.జీవి ప్రకాష్ నాకు కేవలం స్నేహితుడు మాత్రమే అంటూ ఆ వార్తలను ఖండించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవి ప్రకాష్ కి మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ జీవి ప్రకాష్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆ ప్రశ్నను స్కిప్ చేశారు. దీంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

ఒకవేళ ఇద్దరి మధ్య ఏది లేదంటే మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్పాలి. కానీ ఆయన ప్రశ్న ఎందుకు దాటవేశారు అనే డౌట్ చాలా మందిలో కలుగుతుంది. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంటేనే కదా ఆయన ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడలేదు. అంటే నిజంగానే దివ్యభారతి జీవి ప్రకాష్ మధ్య ఏదో సంథింగ్ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగుతోంది. కానీ జీవి ప్రకాష్ పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో విడాకులకు కారణం దివ్యభారతి కాదు అని చెప్పుకొచ్చారు. దాంతో విసిగిపోయిన జీవి ప్రకాష్ అందుకే ఆన్సర్ ఇవ్వలేదు కావచ్చు అని,ఎన్నిసార్లు చెప్పిన మళ్లీ అదే ప్రశ్న ఎదురవుతుంది అనే విసుగుతో ఆ ప్రశ్నని స్కిప్ చేశారని కొంతమంది అంటున్నారు. మరి జీవి ప్రకాష్ దివ్యభారతిల మధ్య రిలేషన్ పై ఇంకెన్ని రూమర్స్ వినిపిస్తాయో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: