
త్వరలోనే వెయ్యి కోట్లను కూడా దాటేస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మూవీ టీం. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటికి కంటిన్యూగా ఎటువంటి నెగిటివ్ టాక్ లేకుండా రన్ అవుతుంది. కాగా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ భారీ మొత్తానికి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి విడుదలకు సిద్ధం చేసింది . మార్చి 7న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తెలుగులో ఎలా ఉండబోతుంది..? ఎలా జనాలను ఆకట్టుకోబోతుంది ..? అనే విషయాలు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా చెప్పేయొచ్చు .
ట్రైలర్ అంతా బాగుంది. విజువల్స్ వేరే లెవెల్ . కానీ శంభాజీ మహారాజ్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్ కి డబ్బింగ్ చెప్పింది ఎవర్రా అంటూ జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . ఈ విధంగా చేశారు ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాలో మొదట తారక్ చేత డబ్బింగ్ చెప్పించాలి అని అనుకున్నారట. కానీ టైం లేకపోవడంతో అది కుదరలేదు. ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ డబ్బింగ్ చెప్పుంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది . నార్త్ లో విక్కీ కౌశల్ వాయిస్ ఎంత హైలెట్ గా మారిందో ఇప్పుడు సౌత్లో అదే మైనస్ గా మారబోతుంది అంటున్నారు జనాలు . చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది..??