యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం ప్రస్తుతం వార్2 సినిమాపై ఉందనే సంగతి తెలిసిందే. ఈ ఏడాదే వార్2 సినిమా విడుదల కానుండగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదట ఈ సినిమాలో తారక్ పాత్ర నిడివి తక్కువ అని వార్తలు వినిపించినా తర్వాత రోజుల్లో ఆ అభిప్రాయం మారింది. తారక్ ఎక్కువ రోజులు షూట్ లో పాల్గొనడంతో వార్2 సినిమాలో తారక్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
 
ఈ సినిమాలో హృతిక్ తారక్ కాంబినేషన్లో ఒక సాంగ్ ఉంటుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. నాటు నాటు సాంగ్ ను తలపించేలా ఆ సాంగ్ ను మించేలా ఈ సాంగ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వార్2 సినిమాకు ఈ సాంగ్ హైలెట్ కావడం పక్కా అని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
 
హృతిక్ రోషన్ సైతం ఎన్టీఆర్ తో పోటీ పడి నటించారని వీళ్లిద్దరి కాంబో సన్నివేశాలు బాగుంటాయని సమాచారం అందుతోంది. కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్న తారక్ భారీ బడ్జెట్ సినిమాలతో కచ్చితంగా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుసగా 7 విజయాలను సొంతం చేసుకున్న తారక్ కు మరికొన్ని విజయాలు చేరాలని అభిమానులు భావిస్తున్నారు.
 
తారక్ హృతిక్ కాంబినేషన్ ఇండస్ట్రీని షేక్ చేసే కాంబినేషన్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ పెరిగేలా తెలివిగా అడుగులు వేస్తుండగా రాబోయే రోజుల్లో తారక్ కు ఎలాంటి హిట్లు దక్కుతాయో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్టులు ఉన్నాయి. 2025 తారక్ కు కలిసిరావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: