సినిమా ఇండస్ట్రిలో ఎప్పుడు రాజమౌళి పేరు తర్వాత అంతస్థాయి లో వైరల్ అవుతున్న ఒకే ఒక్క డైరెక్టర్ పేరు సందీప్ రెడ్డి వంగా.  అంతకుముందు ఈ పేరు గురించి జనాలు పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు కాదు.  ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిందో అప్పటినుంచి ఈయన పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది . ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకోని సందీప్ తెరకెక్కించిన మూవీ యానిమల్. ఈ సినిమాతో రణబీర్ కపూర్ లోని మరో టాలెంట్ బయటపెట్టింది .


సినిమా మరీ ముఖ్యంగా రష్మిక మందన్నాలోని బోల్డ్ యాంగిల్ ని కూడా సందీప్ రెడ్డి బయటపెట్టారు.  ఈ సినిమాని ఎంత రియలిస్టిక్ గా చూపించారీ అందరికి తెలిసిందే. కాగా సందీప్ రెడ్డి వంగా ప్రజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక యానిమల్ పార్క్ అంటూ మరొక సినిమాకి ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు . అయితే ఆయన పలు సందర్భాలలో ఓపెన్ గానే చిరంజీవితో సినిమా చేయాలని ఉంది అంటూ బయట పెట్టాడు .



ఇప్పుడు ఆ విషయాన్ని త్వరలోనే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది . రీసెంట్ గానే ఆయన  మెగాస్టార్ చిరంజీవిని కలిసినట్లు తెలుస్తుంది.  అంతే కాదు వీళ్ళ కాంబోలో సినిమా కూడా సెట్ అయినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ప్రభాస్  సినిమా కంప్లీట్ అవ్వగానే సందీప్ రెడ్డి వంగతో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట . ఈ సినిమా చేయడానికి ఎప్పటి నుండో చేస్తున్నాడట సందీప్ రెడ్డి వంగ . ఫైనల్లీ  ఆ మూమెంట్ రావడంతో సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.  అర్జున్ రెడ్డి - అనిమల్ సినిమాలకి అమ్మ మొగుడి రేంజ్ లో ఈ మూవీ ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: