తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో తెరకెక్కించిన డైరెక్టర్లలో V.B. రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. ఈయన తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో ఎన్నో చిత్రాలు కూడా తీశారు. రచయితగా కూడా తనదైన ముద్ర వేసుకున్న ఈయన జగపతి ఆర్ట్స్ పిక్చర్ పతాకం పైన ఏఎన్ఆర్ తో దసరా బుల్లోడు సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రానికి మొదటిసారిగా దర్శకుడుగా మారారట. ఇందులోని పాటలు ఇప్పటికీ కూడా ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటాయి.


దసరా బుల్లోడు చిత్రంలోని పాటలు మచిలీపట్నం సమీపంలోని భట్ల పెనుమూరు అనే ఊరిలో అవుట్  డోర్ షూటింగ్ తీశారట. ఇందులో ఏఎన్ఆర్ తో పాటు వాణిశ్రీ, పద్మనాభం లాంటివారు నాట్య బృందంలో పాల్గొనడం జరిగిందట. ముఖ్యంగా నిర్మాత నటీనటులు సైతం ఎవరు ఇబ్బంది పడకూడదని షూటింగ్ ప్రాంతంలోనే టాయిలెట్లు, బట్టలు మార్చుకోవడానికి సైతం గదులను కూడా చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశారట. అలా వారం రోజుల పాటు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మద్రాస్ కి వచ్చి చూస్తే కెమెరా సమస్య వల్ల ఫిలిమ్ కనిపించలేదట.


దీంతో చాలా నష్టం జరిగిపోయిందని అయితే దర్శక నిర్మాత అయిన రాజేంద్రప్రసాద్ మాత్రం భయపడకుండా మళ్లీ అందరి దగ్గర డేట్స్ తీసుకొని మరి అంతే ఖర్చు పెట్టి తిరిగి అదే ఊరికి వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చారట. 1971లో విడుదలైన ఈ చిత్రం ఒక ఏడాది పాటు ఎంతో విజయవంతంగా కొనసాగిందట.అలాగే ఏఎన్నార్ కెరియర్ లోనే ఒక ప్రత్యేకమైన సినిమాగా దసరా బుల్లోడు సినిమా నిలిచింది.దసరా బుల్లోడు సినిమాలోని పాటలు "పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో" ఇతరత్రా పాటలు ఇప్పటికే అందర్నీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. అందుకే ఏఎన్ఆర్ చిత్రంలోని పాటలు చాలామంది కొన్ని కొన్ని బీట్ సాంగ్స్ ని ఉపయోగించుకొని ఉంటారు. ఏఎన్ఆర్ ఎన్నో విభిన్నమైన పాత్రలలో కూడా నటించి పేరు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: