
సందీప్ వంగా తీసే సినిమాలలో పురుషాధిక్యత ఎక్కువగా కనిపించేలా అతడి పాత్రల డిజైనింగ్ ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ సినిమాల క్రిటిక్ అనుపమ చోప్రా సందీప్ వంగా సినిమాల పై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సందీప్ తీసే సినిమాలలో స్త్రీలను కించపరిచే విధంగా ఎన్నో సన్నివేశాలు ఉంటాయని అనేకమంది విమర్శలు చేయడం పరిపాటిగా మారింది.
అలాంటి సందీప్ రానున్న రోజులలో ఒక ఫుల్ లెంగ్త్ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నాడని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాదు ఈసినిమాలో పాత్రధారాలు అంతా లేడీ క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పి సందీప్ మరింత షాక్ ఇచ్చాడు. అయితే ఈసినిమా తీయడానికి మరో 4 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నాడు. అంతేకాదు ఇంతవరకు తన సినిమాల పై విపరీతమైన విమర్శలు చేసిన మహిళా సంఘాలు మహిళలు తాను తీయబోయే సినిమాను చూసిన తరువాత తన అభిమానిగా మారడం ఖాయం అని అంటున్నారు.
అయితే కేవలం లేడీ క్యారెక్టర్లతో సినిమా తీయడం ఒక సాహసమే అవుతుంది. అలాంటి సాహసాన్ని గతంలో మహానటి సావిత్రి చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు మహానటి తరహా బయోగ్రఫీ కూడా తనకు చేయాలని ఉంది అంటూ సందీప్ అదే ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలా మారిపోయిన సందీప్ వంగా చెపుతున్న విషయాలను చూసి అతడి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ అవుతున్నాయి..