చారిత్రాత్మక సినిమాలను ప్రేక్షకులు చూడరు అన్న నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ లేటెస్ట్ గా విడుదలైన ‘చావా’ మూవీకి వస్తున్న కలక్షన్స్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈమూవీ రిలీజ్ కు ముందు అంతంత మాత్రంగానే ఉన్న అంచనాలను తిరగ రాస్తూ ఈమూవీ ఘన విజయం సాధించింది.



మౌత్ పబ్లిసిటీతో ఈ మూవీ బాగుంది అంటూ ఈసినిమాను చూసిన ప్రేక్షకుడు మరొకరికి చెప్పడంతో ఈమూవీ తనకు అనుకోని హిట్ గా మారింది. ఉత్తర భారతదేశంలో ఈమూవీ కలక్షన్స్ విషయంలో సృష్టిస్తున్న హంగామా బాలీవుడ్ ఇండస్ట్రీకి హాట్ టాపిక్ గా మారింది.  



సినిమా చూసి థియేటర్లలో తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకుంటున్న సందర్భాలు కూడ ఎన్నో ఉన్నాయి. ఈమధ్య నవీ ముంబయిలో కొందరు యువకులు ఈసినిమాను చూసి ఎగతాళి చేశారట. ఒక మల్టీ ఫ్లేక్స్ లో ప్రదర్శింపబడుతున్న ఈమూవీని చూసిన కొందరు యువకులు ఈమూవీ క్లైమాక్స్ లో అందరు భావోద్వేగానికి గురవుతున్న సమయంలో ఆయువకులు ఆసినిమాను చూస్తూ వెటకారంగా నవ్వారట. మరాఠీ ప్రజలు శివాజీని దేవుడుగా ఆరాధిస్తూ ఉంటారు.



దీనితో కోపానికి గురైన ఆసినిమాలోని ప్రేక్షకులు ఆయువకులను థియేటర్ బయటికి తీసుకొచ్చి వారిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి వాళ్లతో క్షమాపణ చెప్పించడంతో పాటు ‘జై శివాజీ’ ‘జై శంభాజీ’ నినాదాలు  చేయడంతో పాటు వారు ఆ యువకులను క్షమాపణ చెప్పమ్మని పట్టుపట్టారట. ఇప్పుడు ఈ వార్త జాతీయ మీడియాలో సంచలనంగా మారడంతో పాటు ఈ వార్తా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరాఠీ ప్రజలకు ఛత్రపతి శివాజీ దేవుడుతో సమానం. అందుకే ఆయన జీవితం పై ఎన్ని సినిమాలు వచ్చినా విజయవంతం అవుతూనే ఉంటాయి. ఈ మూవీ ఉత్తరభారత దేశంలో సాధించిన ఘన విజయంతో ఇప్పుడు ఈసినిమాను తెలుగులో కూడ డబ్ చేసి ఈవారం విడుదల చేస్తున్నారు. అయితే ఈ డబ్బింగ్ సినిమాను ఎంతవరకు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నది సమాధానంలేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: