
అయితే ఈ సినిమాకు సంబంధించి ఫిబ్రవరిలో విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేలా ప్రచారం చేసింది . ఇటీవల కార్తీక్ కుటుంబ వేడుకలలో శ్రీ లీలా పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆమె ఇతర అతిధులతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది . అంతేకాదు కార్తీక్ తన ఫోన్లో ఆ సందర్భాన్ని వీడియో తీస్తూ ఉంటాడు . అయితే సడన్గా "దెబ్బలు పడతాయి రాజా" పాటకి స్టెప్ లు వేస్తూ ఉండగా పాట ఆగిపోయి మరొక పాట ప్లే అవుతుంది. అప్పుడు ఉన్నట్టుండి శ్రీలీల నవ్వుతుంది .
దీంతో అక్కడ ఉండే వారు కూడా నవ్వుతారు. కార్తీక్ కూడా బాగా ఘట్టిగా నవ్వేస్తాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య చనువు చూసి సాన్నిహిత్యం చూసి వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. అంతేకాదు శ్రీల బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఆర్యన్ అంటూ చాలామంది జనాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో వీళ్ల పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. చూడాలి వీళ్ల ప్రేమాయణం ఎంత వరకు వెళ్తుందో..?? ఇప్పుడు బాలీవుడ్ ఇందస్ట్రీలో ఇదే బిగ్ హాట్ టాపిక్ గా మారింది..!