
నన్ను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దంటూ ఆమె ప్రకటన ఇచ్చారు. నన్ను అభిమానంతో చాలామంది లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారని మీ అందరి ప్రేమాభిమానాల నుంచి ఆ టైటిల్ పుట్టుకొచ్చిందనే సంగతి నాకు తెలుసని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ ఇకపై అందరూ నన్ను నయనతార అని మాత్రమే పిలవాలని నయనతార వెల్లడించారు. నా మనసుకు దగ్గరైన పేరు నయనతార మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.
నయనతార రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. నయనతార ప్రాజెక్ట్ లకు సంబంధించి గతంతో పోలిస్తే వేగం తగ్గింది. చాలామంది హీరోయిన్లలా పెళ్లి తర్వాత ఈ బ్యూటీకి కూడా మూవీ ఆఫర్లు అయితే తగ్గాయనే సంగతి తెలిసిందే. జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే మాత్రమే ఈ బ్యూటీ కెరీర్ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
నయనతార అకస్మాత్తుగా లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దని చెప్పడం వెనుక అసలు కారణం తెలియాల్సి ఉంది. నయనతార కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. నయనతార కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తే ఆమె ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం పక్కా అని చెప్పవచ్చు. నయనతారను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.