సమంత - నాగచైతన్య.. సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ పేర్లు. వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు పెద్ద స్టార్స్ . మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని తమ కంటూఉ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. కొన్నాళ్లు పాటు బాగానే ఉన్నారు . ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ విడాకులు తీసుకున్నారు . వీళ్లు విడాకులు తీసుకుంటే వీళ్ళు ఎంత బాధ పడ్డారో తెలియదు కానీ.. వీళ్ళని అభిమానించే జనాలు మాత్రం బాగా బాధపడిపోయారు . అయితే రీసెంట్ గానే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత అంత సెట్ అయిపోతుంది అనుకున్నారు .


కానీ అప్పటినుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది . సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదురుకుంటుంది నాగచైతన్య భార్య శోభిత ధూళీపాళ్ళ.  ఆమె వల్లే వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.  అదేవిధంగా జనాలు మాట్లాడుకున్నారు. సీన్ కట్ చేస్తే సమంత మాత్రం అసలు ఏమీ పట్టనట్టు ఆమె పని ఆమె చేసుకుంటూ పోయింది. రీసెంట్ గా ఏం మాయ చేసావే సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్లు పూర్తిచేసుకుంది . ఈ క్రమంలోనే స్పెషల్ గా సమంత దీని గురించి మాట్లాడింది .



మరీ ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన షాట్ నాకు ఇప్పటికీ గుర్తు ఉంది అంటూ చెప్పుకొచ్చింది. " కార్తీక్ ను గేట్ దగ్గర కలిసే  షాట్ అది.. చాలా చాలా బాగా గుర్తుంది ..నాకు అన్నీ గుర్తున్నాయి " అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు 15ఏఅళ్లు  అనేది చాలా ఎక్కువ సమయం . కానీ కొన్ని అంశాలు ఎప్పటికీ మర్చిపోను.. కొన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షకంగానే నాగచైతన్యతో వైవాహిక జీవితాన్ని ఎలా ముక్కలు అయ్యిందో  అన్న విషయాన్ని గుర్తు చేసుకుంది . అంతేకాదు ఎక్కడ కూడా నాగచైతన్య పేరు ప్రస్తావన రాకుండా కార్తీక్ అన్న రోల్ ని హైలైట్ చేస్తూ మాట్లాడింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత మాట్లాడిన మాటలు తాలూకా వీడియో బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు సమంత ని ఏదో బాగా డీప్ గా హర్ట్ చేసాడు నాగ చైతన్య ..ఆ కారణంగానే ఆమె ఆయన పేరు కూడా పలకడానికి ఇష్టపడడం లేదు అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: