తమిళ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ కొంతకాలం క్రితం లవ్ టుడే అనే తమిళ సినిమాలో నటించాడు. ఈ మూవీ తమిళ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను అదే టైటిల్ తో తెలుగులో విడుదల చేయగా ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ లో ఈయన హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. తాజాగా ఈయన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయగా తెలుగులో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా ఇప్పటి వరకు దక్కిన కలెక్షన్స్ ... మొత్తంగా దక్కిన కలెక్షన్స్. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వచ్చిన లాభాల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.20 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 2.25 కోట్లు , మూడవ రోజు 2.15 కోట్లు , నాలుగవ రోజు 1.05 కోట్లు , ఐదవ రోజు 85 లక్షలు , ఆరవ రోజు 1.90 కోట్లు , ఏడవ రోజు 1.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఎనిమిదవ రోజు ఈ మూవీ కి 1.10 కోట్ల కలెక్షన్లు దక్కగా , తొమ్మిదవ రోజు 1.90 కోట్లు , పదవ రోజు 2.05 కోట్లు , 11 వ రోజు 75 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 11 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.03 కోట్ల షేర్ ... 16.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.53 కోట్ల లాభాలను అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: