ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ డైరెక్టర్స్ కి ఎలా కోపం తెప్పిస్తున్నారో అందరికీ తెలిసిందే.  మరి ముఖ్యంగా ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం కూడా హీరో ఖాతాలో వేసేస్తారు . ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ ఖాతాలో వేసేస్తారు . అసలు డైరెక్టర్ కు సినిమా తెరకెక్కించడం రాలేదు అని ..సినిమా హీరో ని ఎలా చూపించాలో తెలియదా ..? అని రకరకాలుగా మాట్లాడుతూ వస్తారు . కాగా ఇటీవల ఫీలిం స్టూడెంట్స్ కోసం అక్కినేని అమల నిర్వహించిన  ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ నీల్  కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు . ఇదే మూమెంట్లో "సినిమా చూడడం వేరు తీయడం వేరు" అంటూ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ గా మారింది.
 

"2014 ఉగ్రం సినిమాకి ముందు ఇప్పటి దాక సినిమాలు తీసిన వాళ్లంతా బ్యాడ్ డైరెక్టర్స్ అనుకునేవాడిని .. ఎందుకంటే ఇండస్ట్రీలో నేనే మార్పు తేవాలని ఫీల్ అయిపోయే వాడిని. కానీ సెట్ లోకి అడుగుపెట్టాక షూటింగ్ స్టార్ట్ చేసి కొంత భాగం పూర్తయ్యాక అసలు ఆ కష్టమంటే ఏంటో నాకు తెలిసి వచ్చింది. నేను తీసింది మహా అయితే పదిమంది చూసిన చాలు అనుకునేవాడిని .. టెన్నిస్ లాంటి ఫిలిం మేకింగ్ క్రికెట్ అనుకున్న.. పరిశ్రమలో టీం వర్క్ ఉంటేనే విజయం వర్తిస్తుంది అని ఆలస్యంగా తెలుసుకున్నాను " అంటూ చెప్పుకు వచ్చారు.



అంతేకాదు గతంలో ప్రశాంత్ నీల్ పై ఒక పాన్ ఇండియా హీరో పరోక్షకంగానే ఘాటుగా స్పందించారు. " కొందరు డైరెక్టర్స్ ఒక సినిమా హిట్ అవ్వగానే మేమే తోపు మేమే తురుము అనుకునే రేంజ్ లో ఉంటారు అని ..గర్వంతో అహంకారంతో విర్రవీగుతారు అని ..అలాంటివాళ్లు ఎప్పుడు ఒకే కాన్సెప్ట్ తో మూవీస్ తెరకెక్కించి హిట్ కొట్టాలి అని చూస్తుంటారు అని మాట్లాడారు.. అప్పట్లో అందరూ కూడా ఆ హీరో చెప్పిన డైలాగ్ ప్రశాంత్ నీల్ గురించి అంటూ మాట్లాడుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తన సినిమా సక్సెస్ అవ్వడానికి టోటల్ కారణం సినిమా టీం అని పరోక్షకంగా చెప్పేశాడు . టీం వర్క్ ఉంటేనే సినిమా విజయం సాధిస్తుంది అంటూ ప్రశాంత్ నీల్ చెప్పడం హైలైట్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: