నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. గతంలో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో దసరా అనే సినిమా రూపొందింది. భారీ అంచనాలు నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే వీరి కాంబోలో రూపొందిన దసరా మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో వీరి కాంబోలో రెండవ సినిమా అయిన ది ప్యారడైజ్ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీ గ్లిమ్స్ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ది ప్యారడైజ్ మూవీ గ్లిమ్స్ వీడియో కి 24 గంటల్లో ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. 24 గంటల్లో ఈ మూవీ గ్లిమ్స్ వీడియోకు 17.14 మిలియన్ వ్యూస్ ... 262.8 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ గ్లిమ్స్ వీడియోకు 24 గంటల్లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది అని చెప్పవచ్చు.

మూవీ గ్లిమ్స్ వీడియో అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా గ్లిమ్స్ వీడియోతో పాటు ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు   ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: