కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి ఆ ప్రాంతంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన చాలా సంవత్సరాల క్రితం ఈగ అనే తెలుగు సినిమాలో విలన్ పాత్రలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన చాలా తెలుగు సినిమాల్లో నటించాడు. అలాగే ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి.

తాజాగా ఈయన మాక్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి కర్ణాటకలో 48.80 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.35 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 2.85 కోట్ల కలెక్షన్లు దక్కగా ,  ఓవర్సీస్ లో 2 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 28.15 కోట్ల షేర్ ... 57.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

మూవీ ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 6.85 కోట్ల రేంజ్ లో నష్టాలను అందుకుంది. విడుదల అయిన మొదటి రోజు ఈ మూవీ కి మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కాయి. కానీ లాంగ్ రన్ లో ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం కావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: