టాలీవుడ్ యువ నటుడు నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శ్రీలలా ఈ మూవీ లో నితిన్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... వెంకీ కుడుములమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. కొంత కాలం క్రితం నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే మూవీ రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా వీరి కాంబోలో రూపొందిన భీష్మ సినిమా మంచి విజయాన్ని సాధించి ఉండడంతో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న రాబిన్ హుడ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. తాజాగా మైత్రి నిర్మాతలలో ఒకరు అయినటువంటి రవి శంకర్సినిమా ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్ లో భాగంగా రాబిన్ హుడ్ సినిమాలోని నితిన్ , శ్రీ లీలా జంట గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రవి శంకర్ తాజాగా మాట్లాడుతూ ... కొన్ని సంవత్సరాల క్రితం నేను పోకిరి సినిమాలోని గలగల పారుతున్న గోదారిలా సాంగ్లో ఓ వైపు మహేష్ బాబును చూడాలా ... మరో వైపు ఇలియానాను చూడాలా అనేది అర్థం కాలేదు.

అంత గొప్పగా వారిద్దరూ ఆ సినిమాలో నటించారు. ఆ పాటలో కూడా వారిద్దరూ అంత అందంగా కనిపించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత అంత గొప్పగా రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ , శ్రీ లీల జంట నాకు అనిపించింది. సినిమా చూసి ఈ మాట చెబుతున్నాను అని రవి శంకర్ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: