తాజాగా విక్కీ కౌశల్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన ఛావా అనే సినిమా హిందీ లో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు భారీ ఓపెనింగ్ లభించాయి. ఆ తర్వాత కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాను కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల చేశారు.

ఇక ఈ మూవీ కి హిందీ భాషలో అద్భుతమైన టాక్ రావడంతో ఈ సినిమాని తెలుగు లో భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ తెలుగు వర్షన్ ను మార్చి 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే ఈ మూవీ తెలుగు వర్షన్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మరి ఇప్పటికే హిందీ భాషలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా తెలుగు వర్షన్ కు ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. 18 రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన 10.10 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ కి సంబంధించిన టికెట్స్ బుక్ మై షో లో అద్భుతంగా సేల్ అయినట్లు తెలుస్తుంది.

18 రోజుల్లో ఈ మూవీ కి సంబంధించిన టికెట్స్ కి బుక్ మై షో యాప్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. దానితో ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: