ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ సూపర్ సీనియర్ సింగర్ కల్పనా గురించే మాట్లాడుకుంటున్నారు.  అసలు కల్పనా ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది..? ఆమెకు అంత ప్రాబ్లమ్స్ ఏమున్నాయి..? ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ డే కదా..? ఒక బిడ్డ కూడా ఉంది . ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు ఉన్నాయి అన్న వార్తలు లేవు.  మరి ఎందుకు ఆమె ఇలా ఉన్నట్టుండి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెకు ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ..? లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా ..? ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు.


అయితే రెండు రోజులు ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకుండా అలాగే బెడ్ పై ఉంటే కనీసం పక్కపక్కన వాళ్ళు ఎవ్వరూ కూడా పోలీసులకు ఎందుకు సమాచారం  ఇవ్వలేదు అనేది బిగ్ హాట్ టాపిక్ గా మారింది . ఆమె సాదాసీదా మనిషి కాదు ఒక స్టార్ సెలబ్రెటీ . కచ్చితంగా ఆమె ఇంటిపై ఎవరో ఒకరు కన్ను ఉంటుంది . కానీ ఎందుకు ఆమె రెండు రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాకపోయినా ఇంట్లో లైట్స్ వేయకపోయినా పక్కన జనాలు పట్టించుకోలేదు ..అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది .



అంతేకాదు కల్పనా భర్త పై పోలీసులు అనుమానస్పదంగా విచారిస్తున్నారు . ఆమె ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకొని గత రెండు రోజుల నుంచి ఆమె ఫోన్ ఎవరితో మాట్లాడింది అనే విషయాలను విచారిస్తున్నారు . అంతేకాదు కల్పనా ఫోన్ ని వారం రోజులు ముందు నుంచి కూడా ఎవరితో మాట్లాడింది అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు . అసలు అంత పెద్ద స్టార్ సింగర్ కి ఏం కష్టం వచ్చింది ..? ఎందుకు ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకున్నది ..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది .



సింగర్ కల్పన నిజాంపేటలోని ఓ విల్లా లో భర్తతో కలిసి నివాసం ఉంటుంది. అంత పెద్ద స్టార్ సింగర్ రెండు రోజుల నుంచి బయటకు రాకపోతే పట్టించుకునే నాధుడే లేడా..? అంటూ జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు . రెండు రోజుల తర్వాత పక్క వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కల్పన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం.. డోర్ తట్టినా కూడా తీయకపోవడం ..అదేవిధంగా వాళ్ల ఆయనకు కాల్ చేస్తే ఆయన ఇంట్లో లేకపోవడం .. ఆయన కల్పనకు కాల్ చేసిన.. కల్పన ఫోన్ ఎత్తకపోవడం అన్ని ఒకదానికి ఒకటి కనెక్షన్ గా కొత్త డౌట్లు పుట్టిస్తున్నాయి . పోలీసులు సహాయంతో డోర్ బద్దలు కొట్టి అక్కడ స్పృహ తప్పి పడిపోయిన ఆమెను దగ్గరలోనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.  ప్రస్తుతం కల్పనా కండిషన్ బాగానే ఉన్నట్లు తెలుస్తుంది . అసలు కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నది అనేది పోలీసులు బయట పెడితే మాత్రమే తెలుస్తుంది . చూద్దాం పోలీసులు ఎప్పుడు బయట పెడతారు అనేది...???

మరింత సమాచారం తెలుసుకోండి: