బుక్ మై షో లో అత్యధిక టికెట్స్ సెల్ అయిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమాకు సంబంధించిన 20.28 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి. ఇప్పటి వరకు అత్యధిక టికెట్స్ సేల్ జరిగిన ఇండియన్ సినిమాలలో పుష్ప 2 మూవీ మొదటి స్థానంలో కొనసాగుతుంది. యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీకి సంబంధించిన 17.7 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి. దానితో ఈ సినిమా రెండవ స్థానంలో కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమాకు సంబంధించిన 16 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి. దానితో ఈ మూవీ మూడవ స్థానంలో కొనసాగుతుంది. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సంబంధించిన 13.4 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి.

దానితో ఈ సినిమా నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాకు సంబంధించిన 13.14 మిలియన్ టికెట్ సేల్స్ బుక్ మై షో లో జరిగాయి. దానితో ఈ సినిమా ఐదవ స్థానంలో కొనసాగుతుంది. జవాన్ మూవీ కి సంబంధించిన 12 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో సేల్ కాగా , స్త్రీ 2 కు సంబంధించిన 11.14 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి. పటాన్ మూవీ కి సంబంధించిన 10.9 మిలియన్ టికెట్స్ బుక్ మై షో లో సేల్ కాగా , విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన చావా మూవీ కి సంబంధించిన 10.10 మిలియన్ టికెట్స్ కేవలం 18 రోజుల్లోనే సేల్ అయ్యాయి. రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ మూవీకి సంబంధించిన 9.94 మిలియన్ టికెట్స్ బుక్ మై షో జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: